Friday, May 16, 2008

trial in Unicode

పంచమొక పద్మవ్యూహం ,కవిత్వమొక తీరని దాహం అన్నారు. అలా గుండె గొంతుకలోన కొట్లాడినపుడు , నే రాసిన పాటలు ఎన్నో ..కొన్ని నెలుగులోని, కొన్ని కలుగులోని వున్నాయి. అవీ, ఇవీ,అన్నీ ఇలా ............. ఈ పాట ..నా మొదటి రికార్డింగ్.. నా లోని ఆనందం , బాష్పాలుగా జారి ,భావాలుగా మారి , భారతమంతా విహరించిన పూ బాట. ఈ పాట.
భారతమా ..ప్రియ భారతమా.
బంగరు వెలుగుల భవితవమా.
నీ ముంగిట పారిజాతాలు,
నవకాంతి, శాంతి , మణి దీపాలు
సాధనమే తమ ఆయుధమై
సాధించిన ఘన విజయాలు... కీర్తి కిరీటాలు..
కీర్తి కిరీటాలు..కీర్తీ కిరీటాలూ.
సంగీత నాట్య కోవిదులు
సమ్మోహ నట వైతాళికులు
క్రీడల అనితర సాద్యు లు
శాంతి పావురాలు వింతైన గోపురాలు
మృతి లేని మందిరాలు గత కాల వైభవాలు
చెరిగే పోని , తరుగే లేని సృతిగా మిగిలిపో యే కీర్తి కిరీటాలు..కీర్తికిరీటాలు..కీర్తికిరీటాలు.

0 comments: