Saturday, October 22, 2011

రాత్రి - ధాత్రి

ఎవరున్నారని
ఏమవుతారని
అడుగుతోంది ఈ రాత్రి
వెతుకుతోంది ఈ ధాత్రి .....ఎ......
ఎదలోపలికధలేవేవో
ఎదుటకొచ్చి ప్రశ్నలు వేస్తే
సమాధానమిచ్చేవారు
సరిహద్దులొ కానరారు
తెలియాలని ఎందుకు తపన
తెలుసుకుంటే ఆగేనా నటన
మనిషి కధకు వుందా ముందు
మనోవ్యధకు లేదా మందు
మనసిచ్చి కోసేదెవరు
మమత పెంచి తుంచేదెవరు
తెలియాలని ఎందుకు తపన
తెలియకుంటే అంతా ఘటన
అయోమయం ఆదీ అంతం
అంధకారమేనా సత్యం
కాలానికి కావలి ఎవరు
కలని ఇలని కలిపేదెవరు
తెలియాలని తపనెంతున్నా
తేటతెల్లమగునా నాన్నా...


బాబా

సర్వమతముల సారం నీవని
సకలచరాచర రూపం నీదని
రుజువు చేయగా ఈ భువిని
నిజముగ వచ్చిన ఓ బాబా. ...స...
అజ్ఞానమనే అంధకారమున
ఆనందమనే జ్యోతి ని నిలిపి
అహింసయే పరమధర్మమని
అన్నీ విడచిన బుధ్దుడు నీవే .......స...
కలతలవలో చిక్కిన లోకుల
కాపాడుటకై నేనొచ్చానని
కలవరమొద్దని శిలువను మోసిన
కరుణామయుడవు క్రీస్తువి నీవే .......స......
మతమేదైనా హితమొకటేనని
మమతను మించిన మతమే లేదని
మానవత్వమే మహిలో నింపగ
మానవుడైన మహమ్మద్ నీవే ......స....
నిత్యపూజలు వేరైనగాని
నిగమాగములు అన్నీ ఒకటే
నామాలెన్నున్న రూపాలేవైన నిఖిలలోక పరిపాలకుడొకడే

కీర్తి kireeTalu

భారతమా ప్రియభారతమా
బంగరు వెలుగుల భవితవమా
నీముంగిట పారిజాతాలు
నవకాంతి శాంతి మణి దీపాలు
సాధనమే తమ ఆయుధమై
సాధించిన ఘన విజయాలు
కీర్తి కిరీటాలు కీర్తి కిరీటాలు..
సంగీత నాట్య కోవిదులు
సమ్మోహ నట వైతాళికులు
క్రీడల అనితర సాద్యులు
శాంతి పావురాలు
వింతైన గోపురాలు
మృతి లేని మందిరాలు
గతకాల వైభవాలు
చెరిగేపోని తిరుగే లేని
స్మృతిగా మిగిలిపోయే కీర్తి కిరీటాలు కీర్తి కిరీటాలు
.

కీర్తి కేరితాలు