Sunday, May 18, 2008

నా భావనలో .....

The feelings of inner soul. If the sun is lulling with sleep, the swinging of boat in deep water are the similies of my feelings with you.

నింగిలో సుర్యుడే
నిదురతూగువేళ
నీటిలో పయనమై
నావ సాగు వేళ
వూహల వుయ్య్యాలలో
వూగింది మనసు
వూరికే కవ్వించే
గాలికెంత అలుసు. ..... నింగిలో ..
1చరణం.. వూసులేవొ చెప్పింది
తూరుపుదిశ గాలి
బాసలేవొ చేసింది
గువ్వ ఒడిని వాలి
నీలి మేలి ముసుగులో
మెరిసిందొక తార
నీరజదళ మధ్యంలో
మ్రోగింది ఓ సితార.. నింగిలో.
2 చరణం. పశ్చిమాన పూచింది
పగడపూల తోట
పలకరించి పోయింది
పాలపిట్ట జంట
పలు వన్నెల చిన్నెలతో
పల్లవించె ప్రకృతి
పరవశించి నా హృదిలో
పలికిందీ గీతి. ..నింగిలో..

0 comments: