This lyric was written for a T.V.Serial that was telecasted in Gemini T.V. "Navavasantham" The new era. The lyric was a resemblance of spring. The coocucoo which sings in spring season memorizes the arrival of spring.
ఈ పాట టి.వి .సీరియల్ కి టైటిల్ సాంగ్ . వాడి ,మోడైన తోటఅలాగే వుండి పోదని, వ సంతంవచ్చిచిగురింపచేస్తుంది,అంతవరకు ఓర్పుగా ఎదురు చూడాలి .
కాలం లిఖించిన కాగితం
ఈ జీవితం..
కరిగి పోనివ్వకుమా నేస్తం..
పల్లవి.. పాడే కోయిలా
ఆశను వీడకే
వాడిన మోడుకే
మరో వసంతం రాదా..
చిన్నారి కన్నుల్లో
వెన్నెలలే విరిసే
కనుల్ల్లో గోదారి
మిన్నులకే ఎగసే.. ..పాడే..
1 వ చరణం. ఎదురాయె ముళ్ళ బాట
విధిఆడె వింత ఆట
అమవాస వచ్చెనంట
అందాల పూలతోట
గతమన్న తీపి స్వప్నం
బతికించలేము నే స్తం
వెలుగు కోసం
సాగాలి జీవితాంతం
కష్టాలు ,కన్నీళ్ళు
కరిగేను ఆనవా ళ్ళు
కాలాల జాలంలో కురిసేను
పూలజల్లు పాడే ..కోయిలా.
ఆశే తీరగా శ్వాసే పాటగా
మరో వసంతం రాదా .. ..పాడే..
Sunday, May 18, 2008
మరో వసంతం
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment