Saturday, October 25, 2008

Happy Diwali

Friday, August 15, 2008

Happy Independence Day

Sunday, June 29, 2008

ALMIGHTY

Saturday, June 28, 2008

LOVE


NIGHTINGALE



KEERTHI KIREETAALU

Monday, June 16, 2008

Wanna stay

where the mind
conquers the fear

where the affection
suppresses the malice

where the peace
en devour the entity

where the equity
and equality blossoms

where the humanity
wins over the cruelty

where the mother's lap
and father's care

wanna stay
where the soothing childhood lasts.

Wednesday, June 11, 2008

LOVE

The feel of love is unique one. The soul seeks the feeling of love. known to only soul.


లవ్

తల
పు ల నావలో
తనువు ప్ర యాణం
తళుకుల తోవలో
మనసు మయూరం ..తలపు..

తరగదులే అనురాగపు గని
తలిరాకుల తావుల
ఇల చేరే కిరణమది
వడగాడ్పులు వీచినా
వానజల్లు కురిసినా
వాడదు,వీడదు,ఎడ¬బాయదు ఏ మనస్సుని. ..తలపు..

ప్రేమంటే సిరివెన్నెల స్నానమని
పేరూ వూరూ లేని
పేదదైన పెన్ని«ధని
కలకాలం కన్నులలో
కలవరించు గుండెలలో
కొలువై,నెలవై, వెలివేయదు ఏ మనస్సుని.. ..తలపు..

Sunday, May 18, 2008

మరో వసంతం

This lyric was written for a T.V.Serial that was telecasted in Gemini T.V. "Navavasantham" The new era. The lyric was a resemblance of spring. The coocucoo which sings in spring season memorizes the arrival of spring.
ఈ పాట టి.వి .సీరియల్ కి టైటిల్ సాంగ్ . వాడి ,మోడైన తోటఅలాగే వుండి పోదని, వ సంతంవచ్చిచిగురింపచేస్తుంది,అంతవరకు ఓర్పుగా ఎదురు చూడాలి .
కాలం లిఖించిన కాగితం
ఈ జీవితం..
కరిగి పోనివ్వకుమా నేస్తం..
పల్లవి.. పాడే కోయిలా
ఆశను వీడకే
వాడిన మోడుకే
మరో వసంతం రాదా..
చిన్నారి కన్నుల్లో
వెన్నెలలే విరిసే
కనుల్ల్లో గోదారి
మిన్నులకే ఎగసే.. ..పాడే..
1 వ చరణం. ఎదురాయె ముళ్ళ బాట
విధిఆడె వింత ఆట
అమవాస వచ్చెనంట
అందాల పూలతోట
గతమన్న తీపి స్వప్నం
బతికించలేము నే స్తం
వెలుగు కోసం
సాగాలి జీవితాంతం
కష్టాలు ,కన్నీళ్ళు
కరిగేను ఆనవా ళ్ళు
కాలాల జాలంలో కురిసేను
పూలజల్లు పాడే ..కోయిలా.
ఆశే తీరగా శ్వాసే పాటగా
మరో వసంతం రాదా .. ..పాడే..

నా భావనలో .....

The feelings of inner soul. If the sun is lulling with sleep, the swinging of boat in deep water are the similies of my feelings with you.

నింగిలో సుర్యుడే
నిదురతూగువేళ
నీటిలో పయనమై
నావ సాగు వేళ
వూహల వుయ్య్యాలలో
వూగింది మనసు
వూరికే కవ్వించే
గాలికెంత అలుసు. ..... నింగిలో ..
1చరణం.. వూసులేవొ చెప్పింది
తూరుపుదిశ గాలి
బాసలేవొ చేసింది
గువ్వ ఒడిని వాలి
నీలి మేలి ముసుగులో
మెరిసిందొక తార
నీరజదళ మధ్యంలో
మ్రోగింది ఓ సితార.. నింగిలో.
2 చరణం. పశ్చిమాన పూచింది
పగడపూల తోట
పలకరించి పోయింది
పాలపిట్ట జంట
పలు వన్నెల చిన్నెలతో
పల్లవించె ప్రకృతి
పరవశించి నా హృదిలో
పలికిందీ గీతి. ..నింగిలో..

Friday, May 16, 2008

Second

ఇది కూడా అందమైన తోటలో విహరించిన పాట.. అందరినీ అలరించిన పాట.
ఎవరు పూసిన రంగులో ..
ఈ విరుల కెన్ని హంగులో..
అందమూ సౌగంధమూ
అందించు వారెవ్వరో
నిదురపోయే పొదల ఎదలను
తట్టిలేపే దెవ్వరో..
ఒదిగి పోయే పూల పెదవుల
ము ద్ర లుంచేదెవ్వరో
సద్దు చేసే గువ్వ గూటిలో
సుద్దులు విన్నది ఎవ్వరో
విరియు ఆశల తీవె చెలియకు
నీరు పోసే దెవ్వరో..

trial in Unicode

పంచమొక పద్మవ్యూహం ,కవిత్వమొక తీరని దాహం అన్నారు. అలా గుండె గొంతుకలోన కొట్లాడినపుడు , నే రాసిన పాటలు ఎన్నో ..కొన్ని నెలుగులోని, కొన్ని కలుగులోని వున్నాయి. అవీ, ఇవీ,అన్నీ ఇలా ............. ఈ పాట ..నా మొదటి రికార్డింగ్.. నా లోని ఆనందం , బాష్పాలుగా జారి ,భావాలుగా మారి , భారతమంతా విహరించిన పూ బాట. ఈ పాట.
భారతమా ..ప్రియ భారతమా.
బంగరు వెలుగుల భవితవమా.
నీ ముంగిట పారిజాతాలు,
నవకాంతి, శాంతి , మణి దీపాలు
సాధనమే తమ ఆయుధమై
సాధించిన ఘన విజయాలు... కీర్తి కిరీటాలు..
కీర్తి కిరీటాలు..కీర్తీ కిరీటాలూ.
సంగీత నాట్య కోవిదులు
సమ్మోహ నట వైతాళికులు
క్రీడల అనితర సాద్యు లు
శాంతి పావురాలు వింతైన గోపురాలు
మృతి లేని మందిరాలు గత కాల వైభవాలు
చెరిగే పోని , తరుగే లేని సృతిగా మిగిలిపో యే కీర్తి కిరీటాలు..కీర్తికిరీటాలు..కీర్తికిరీటాలు.

Saturday, May 10, 2008

First Post

This is my first attempt to post the works from me. I am much interested in lyric writing in my Mother tongue Telugu. I got my works published in different T.V. Channals too. I already got the lyrics with me. These are the lyrics that were the feelings of mine.
For this work I sincearly owe to my Gurus. I sincearly acknowledge my greatest concern to my first guru that is my Father Sri Akundi Rajeswara Rao. Who is a Writer, actor and a freelance Artist. I feel great to acknowldge inspiring guru Sri Devulapalli Krishna Sastry garu to give his blessings. I once again acknowldge greetings to my inspiring guru sri Sirivennela Sitarama Sastry garu. With great concern over all my Gurus I geel happy to place my works through this opening.